రాబోయే రెండు సినిమాలను ప్రకటించిన మహేష్ బాబు


రాబోయే రెండు సినిమాలను ప్రకటించిన మహేష్ బాబు
రాబోయే రెండు సినిమాలను ప్రకటించిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చి చేసిన సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన తెచ్చుకుంది. దీనికి సంక్రాంతి సీజన్ కూడా తోడవ్వడంతో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లోనే కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రం 50 కోట్ల షేర్ మార్క్ ను దాటడం విశేషం. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ పట్ల మహేష్ బాబు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా తన పెర్ఫార్మన్స్ పట్ల, మైండ్ బ్లాక్ సాంగ్ లో తన డ్యాన్స్ పట్ల వస్తున్న రెస్పాన్స్ కు ఫిదా అయిపోయాడు. అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే కనిపించడంతో మహేష్ అభిమానులు ఖుషీ అయిపోయారు.

ఈ చిత్ర విజయంలో భాగంగా మహేష్ బాబు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టిన సంగతి తెల్సిందే. ట్విట్టర్ లో అభిమానులను ప్రశ్నలు అడగమని పిలుపునిచ్చిన మహేష్, నిన్న వాటిలో కొన్నిటిని సెలక్ట్ చేసి వాటికి సమాధానాలు ఇచ్చాడు.

ఈ సందర్భంగా ఒక ఫ్యాన్ మళ్ళీ అనిల్ రావిపూడితో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించాడు. దానికి మహేష్.. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. అది పూర్తైన వెంటనే మేమిద్దరం కలిసి పనిచేస్తాం అని రివీల్ చేసాడు. మహేష్ బాబు 27వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెల్సిందే. మహేష్ మూడు నెలలు బ్రేక్ తీసుకుని వంశీ పైడిపల్లి సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈలోగా అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా పూర్తి చేసుకుని మళ్ళీ మహేష్ దగ్గరకు వస్తాడన్నమాట. అంటే మహేష్ 28వ సినిమా అనిల్ రావిపూడితో ఉంటుంది. సో, మహేష్ రాబోయే రెండు చిత్రాలు ఖరారైనట్లే. వీటికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రివీల్ అయ్యే అవకాశముంది.