ఈ నెలలోనే మహేష్ – త్రివిక్రమ్ సినిమా రెండు ఆసక్తికర అప్డేట్స్

Mahesh Babu Trivikram Srinivas update on may 31st 
Mahesh Babu Trivikram Srinivas update on may 31st

సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరూ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేసారు. ఈ రెండు చిత్రాలు కూడా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. మళ్ళీ 11వ సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.

హారిక అండ్ హాసిని బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని, సమ్మర్ 2022లో చిత్రం విడుదలవుతుందని అధికారికంగా తెలియజేసారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండు ఆసక్తికర విషయాలు ఈ నెలలో విడుదల కాబోతున్నాయని సమాచారం. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రెండు కీలకమైన అప్డేట్స్ ను ఇవ్వనున్నారు.

ఈ చిత్ర టైటిల్ ను మే 31న విడుదల చేస్తారు. టైటిల్ లోగోతో చిత్ర థీమ్ గురించి కూడా ఒక ఐడియా వచ్చేలా మోషన్ పోస్టర్ ను వదలనున్నారు. అలాగే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో కూడా అప్డేట్ ఇవ్వనున్నారు. అన్ని త్రివిక్రమ్ సినిమాల్లో లానే ఈ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తోంది.