ఎన్టీఆర్ కథానాయకుడు పై మహేష్ ట్వీట్


Mahesh babu tweet on NTR Kathanayakudu

ఎన్టీఆర్ కథానాయకుడు నిన్న విడుదలైన విషయం తెలిసిందే . కాగా ఈ సినిమా పై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ కథానాయకుడు పై ట్వీట్ చేసి శుభాకాంక్షలు అందజేశాడు ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ కు . తెలుగు సినిమా గర్వించతగ్గ మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడని , అలాగే ఇతర పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు ఆయా పాత్రలలో లీనమై నటించారని , దర్శకులు క్రిష్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడాడు మహేష్ . ఇదే ఎన్టీఆర్ కు అసలైన నివాళి అంటూ పేర్కొన్నాడు .

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . వసూళ్ల తో పాటుగా ప్రశంసల జల్లు కూడా కురుస్తోంది . అక్కినేని పాత్రలో సుమంత్ , బసవతారకం పాత్రలో విద్యాబాలన్ , హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ అలాగే మిగతా నటీనటులు కూడా ఆయా పాత్రల్లో సరిగ్గా సరిపోయారు . ఇక ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని వచ్చే నెల ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ మహానాయకుడు కూడా సంచలన విజయం సాధిస్తుందని అంటున్నాడు మహేష్ బాబు .

English Title: Mahesh babu tweet on NTR Kathanayakudu