మహేష్ బాబు కు ఇష్టం లేదా


mahesh babu unhappy with sudheer babuమహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించాడు అంతేకాదు ఒక ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు నిర్మిస్తానని ప్రకటించాడు కూడా . ఈ వేడుకకు పలువురు నటీనటులు , దర్శక నిర్మాతలు హాజరయ్యారు కానీ మహేష్ బాబు కానీ ఆ కుటుంబం నుండి ఒక్కరు కూడా హాజరు కాలేదు దాంతో సుధీర్ బాబు నిర్మాతగా మారడం వాళ్లకు ఇష్టం లేదా అనే గుసగుసలు మొదలయ్యాయి .

మహేష్ బాబు కి సుతరామూ ఇష్టం లేదని లేకుంటే తప్పకుండా హాజరు అయ్యేవాడని అంటున్నారు . అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఇండియా లో లేడు ఫారిన్ వెళ్ళాడు , ఆ విషయాన్నీ పక్కన పెడితే మహేష్ కు ఇష్టం అయితే తప్పకుండా వచ్చేవాడు ….. మహేష్ డేట్ ని బట్టి సుధీర్ ఈవెంట్ పెట్టుకునేవాడు అన్న చర్చ జరుగుతోంది . మహేష్ అంటే ఊళ్ళో లేడు కానీ కృష్ణ కుటుంబం నుండి కూడా ఎవరూ హాజరు కాలేదు ఈ కార్యక్రమానికి . హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయాడు సుధీర్ బాబు దాంతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసాడు . మరి నిర్మాతగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తాడా ? లేదా చూడాలి .