సరిలేరు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అసలు మిస్ అవ్వకూడదట!


Mahesh babu urges not to miss starting of second half in sarileru neekevvaru
Mahesh babu urges not to miss starting of second half in sarileru neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సంగతి తెల్సిందే. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమాకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు టీమ్ మొత్తం ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుండడం విశేషం. వివిధ కాంబినేషన్స్ లో చిత్రం గురించి విశేషాలు చెబుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు టీమ్.

మహేష్ బాబు సైతం చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇంటర్వ్యూలలో సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకునే క్రమంలో మహేష్ బాబు ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ ను రివీల్ చేసాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యాక ఒక మంచి మూడ్ లో ఇంటర్వెల్ కోసం థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వెళ్తారు కానీ వీలైనంత తొందరగా వచ్చి మళ్ళీ సీట్స్ లో కూర్చోమంటున్నాడు. ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే ఉండే ఒక ఎపిసోడ్ చిత్రానికి చాలా కీలకమట. ఆ సీన్ చూసేటప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఇంతకీ ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ సీన్ లో మహేష్ బాబు ఉండడట.

మరి మహేష్ బాబు లేకుండా గూస్ బంప్స్ వచ్చే సీన్ లో ఏముంటుందబ్బా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న హింట్ కూడా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాడు. అప్పుడు అనిల్ రావిపూడి చెప్పిన మాటలకు, తర్వాత మహేష్ బాబు చెప్పిన విశేషాలకు ఏమైనా సంబంధం ఉందా అన్న చర్చ నడుస్తోంది. కృష్ణకు సంబంధించిన విజువల్స్ సినిమాలో ఉండొచ్చని అంటున్నారు. చూద్దాం మరి ఎలాంటి సీన్ ఉంటుందో.