అల్లరి నరేష్ కు వార్నింగ్ ఇచ్చిన మహేష్


mahesh babu warns allari nareshఅల్లరి నరేష్ కు మహేష్ బాబు వార్నింగ్ ఇచ్చాడట ! మహేష్ ఏంటి ? అల్లరి నరేష్ కు వార్నింగ్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా మహేష్ బాబు , అల్లరి నరేష్ లు ఇద్దరూ ” మహర్షి ” చిత్రంలో నటిస్తున్నారు . ఇప్పటికే 45 రోజుల పాటు షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంది అయితే అందులో అల్లరి నరేష్ పాత్ర మహేష్ ఫ్రెండ్ అని తెలుసు కానీ పూర్తిస్థాయి పాత్ర ఏంటో తెలియదు అయితే ఆ వివరాలు మాత్రం ఎవరికీ చెప్పొద్దూ అని మహేష్ బాబు అల్లరి నరేష్ కు వార్నింగ్ ఇచ్చాడట ! మహేష్ బాబు హెచ్చరికలు జారీ చేసాడు కాబట్టి చెప్పనని అంటున్నాడు .

గమ్యం సినిమాలో పోషించిన గాలి శీను లాంటి పాత్ర పోషిస్తున్నాడట అల్లరి నరేష్ . తప్పకుండా మహర్షి చిత్రంలో చేస్తున్న పాత్ర నాకు మంచి పేరు తెచ్చి పెడుతుందని నమ్మకంగా ఉన్నాడు అల్లరి నరేష్ . ఇక ఆ సినిమాని పక్కన పెడితే తాజాగా ఈ హీరో నటించిన ” సిల్లీ ఫెల్లోస్ ” విడుదలకు సిద్ధమైంది . చాలాకాలంగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ కు సిల్లీ ఫెల్లోస్ విజయాన్ని కట్టబెడుతుందో లేదో తెలియాలంటే రెండు రోజులు ఎదురు చూడాల్సిందే .

English Title: mahesh babu warns allari naresh