సుధీర్ ని హెచ్చరించిన మహేష్ బాబు


Mahesh babu warns sudheer babuమహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ” నన్ను దోచుకుందువటే ” చిత్రంతో నిర్మాతగా కూడా మారాడు . హీరోగా ఎలాగూ నటిస్తున్నావ్ కదా ! సినిమాలు ఉన్నాయి కదా !! ఇప్పుడు నిర్మాతగా రిస్క్ చేయడం అవసరమా ? అని సుధీర్ ని ప్రశ్నించాడట కూడా అప్పట్లో . ఈ విషయాన్నీ స్వయంగా సుధీర్ బాబు వెల్లడించాడు , కట్ చేస్తే నన్ను దోచుకుందువటే సినిమా విడుదలకు సిద్ధమైంది . ఈనెల 21న సుధీర్ బాబు హీరోగా నటించి నిర్మించిన చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో సుధీర్ బాబు తప్పు చేస్తున్నాడా ? ఒప్పు చేశాడా ? అన్నది తేలిపోనుంది .

హీరోగా నటిస్తున్నాడు కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు సుధీర్ బాబు , అసలు అర్జున్ రెడ్డి చిత్రం అలాగే , ఆర్ ఎక్స్ 100 చిత్రాలు మొదట సుధీర్ బాబు దగ్గరకే వచ్చాయట ! కానీ సుధీర్ బాబు నాన్చడంతో అవి ఇతర హీరోలను వరించాయి కట్ చేస్తే బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . మహేష్ బాబు హెచ్చరించినప్పటికీ నిర్మాతగా మారిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే చిత్రంతో హిట్ కొడతాడా ? లేక ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి అంతా వేరేవాళ్లు దోచుకున్నట్లే అవుతుందా చూడాలి .

English Title: Mahesh babu warns sudheer babu