ఎవెంజర్స్ ని చూసిన మహేష్ బాబు


ఎవెంజర్స్ సినిమా చూడటానికి నా థియేటర్ లో నాకే టికెట్లు దొరకలేదు అవి దొరికాక సినిమా చూస్తానని చెప్పిన మహేష్ బాబు ఎట్టకేలకు నిన్న ఎవెంజర్స్ సినిమా చూసాడు . మహేష్ బాబు ఏషియన్ వాళ్ళతో కలిసి ” ఏ ఎం బి ” సినిమాస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే . అయితే అందులో ఇంతవరకు సినిమా చూడలేదు మహేష్ ఎవెంజర్స్ ని చూసి తన ఏ ఎం బి టీమ్ ని అభినందించాడు మహేష్ .

ఇక మహేష్ నటించిన మహర్షి చిత్రం ఈ నెల 9 న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . ఆ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటూ చాలా బిజీ గా ఉన్నాడు మహేష్ , ఎంత బిజీ గా ఉన్నప్పటికీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని చూడాలని డిసైడ్ అయ్యాడు అందుకే తీరిక చేసుకొని మరీ సినిమా చూసాడు . ఇక తమ బాస్ సినిమా చూడటానికి రావడంతో ఏ ఎం బి టీమ్ ఫుల్ ఖుషీ అయ్యింది . ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మహేష్ బాబు కు బాగా నచ్చిందట ! ఇదే విషయాన్నీ ట్వీట్ చేసాడు .