మహేష్ – అనిల్ రావిపూడి ప్రత్యేకతలేంటో తెలుసా ?

జూన్ లో మహేష్ బాబు కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే . ఎఫ్ 2 తో ఈ ఏడాది సంచలన విజయం సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు తన కొత్త సినిమా చేయనున్నాడు . యాక్షన్ తో పాటుగా వినోదాన్ని మేళవించి చేసే ఈ సినిమా ప్రత్యేకతలు ఏంటో తెలుసా …… ….. లేడీ అమితాబ్ గా పేరుగాంచిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం .

ఇన్నాళ్లు గా సినిమాలకు దూరంగా రాజకీయాలతో మమేకమైన విజయశాంతి చాలాకాలం తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకోనుంది . అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో పప్పు సుద్ద అనే పేరు బాగా ఫేమస్ అయ్యింది కాగా ఆ పాత్రలో బండ్ల గణేష్ నటించనున్నాడు . బండ్ల గణేష్ కూడా సినిమాల్లో యాక్టింగ్ తగ్గించి నిర్మాతగా మారిన విషయం తెలిసిందే . ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాడు కానీ అక్కడ ఇమడలేక మళ్ళీ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ సినిమాతోనే ! ఇక హీరోయిన్ రష్మిక మందన్న విషయానికి వస్తే చిన్నహీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ భామకు తాజాగా మహేష్ బాబు తో రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది ఈ సినిమాతోనే . అలాగే దిల్ రాజు – అనిల్ సుంకర లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండటం మరో విశేషం . మహర్షి చిత్రం తర్వాత మహేష్ నుండి రానున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి .