మహేష్ 27వ చిత్రాన్ని నిర్మించనున్న అల్లు అరవింద్


mahesh babus 27 th film with allu aravind

అల్లు అరవింద్ మెగా హీరోలతో మాత్రమే భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించాడు కట్ చేస్తే అతడి ధోరణిలో మార్పు వచ్చింది బయటి హీరోలతో కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు అయితే అవి చిన్న బడ్జెట్ సినిమాలు కానీ ఇప్పుడు ఏకంగా భారీ సినిమాలు తీయాలని అందునా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు అల్లు అరవింద్. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . ఇటీవలే మహేష్ బాబుని కలిసిన సమయంలో సినిమా తీయాలని ఉందని అల్లు అరవింద్ అన్నాడట . దానికి మహేష్ తప్పకుండా చేద్దామని అయితే కథ సెట్ అయితే చేద్దామని అన్నాడట .

కట్ చేస్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ చేసే సినిమాకు అల్లు అరవింద్ సెట్ అయ్యాడని తెలుస్తోంది . అసలు ఈ సినిమాని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించాలి కానీ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు 26వ సినిమాని నిర్మిస్తోంది మైత్రి మూవీస్ సంస్థ కావడంతో మళ్ళీ వెంటనే అదే సంస్థ కు చేసేబదులు అల్లు అరవింద్ తో చేద్దామని అనుకుంటున్నాడట మహేష్ బాబు . ఇది కనుక సెట్ అయితే సుకుమార్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .

English Title: mahesh babus 27 th film with allu aravind