మహర్షి రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా


మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రానికి ఉమైర్ సందు రివ్యూ రేటింగ్ ఇచ్చాడు . వివాదాస్పద వ్యక్తి అయిన ఉమైర్ సందు ఇప్పటివరకు సూపర్ ….. బంపర్ …… డంపర్ అంటూ రేటింగ్ ఇచ్చిన సినిమాలు దాదాపుగా డిజాస్టర్ లు అయ్యాయి . కాకపోతే ఒకటి అరా చిత్రాలు మాత్రం నిజంగానే సూపర్ హిట్ అయ్యాయి . తాజాగా మహర్షి చిత్రానికి కూడా రేటింగ్ ఇచ్చాడు ఉమైర్ సందు . ఇంతకీ మహర్షి రేటింగ్ ఎంతో తెలుసా …….. 4 /5. 

5 స్టార్ కి 4 స్టార్స్ అంటూ తన రివ్యూ ని ఇచ్చాడు ఉమైర్ సందు . యు అండ్ యూకే సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ ప్రతీ భారీ సినిమాకు రేటింగ్ ఇస్తుంటాడు . ఇక మహర్షిగా మహేష్ బాబు అద్భుత నటనతో ఆకట్టుకున్నాడని , తప్పకుండా పైసా వసూల్ సినిమా అంటూ ట్వీట్ చేసాడు . ఇక్కడ సెన్సార్ టాక్ కూడా బాగానే ఉంది దాంతో మహర్షి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు చిత్ర బృందం