మహేష్ మహర్షి టీజర్ రివ్యూ


mahesh babus maharshi teaser reviewమహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి మహర్షి అనే టైటిల్ ని పెట్టిన విషయం తెలిసిందే. టైటిల్ తో కూడిన మహేష్ బాబు స్టిల్ ని రిలీజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిత్ర బృందం. ఇక దానికి తోడు టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. టీజర్ లో మహేష్ పాతికేళ్ల కుర్రాడి లా ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. అచ్చం కాలేజీ కుర్రాడిని మరిపించాడు మహేష్. హాఫ్ హాండ్స్ ఉన్న చొక్కా వేసుకొని ఆ హ్యాండ్స్ ని మెలితిప్పి మరీ నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయిల గుండె లయ తప్పుతుంటే చూడాలి ఆ సీన్ రసవత్తరంగా ఉంది.

ఎవరైనా అందమైన అమ్మాయిలను చూసి పిచ్చెక్కిపోతారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది , మహేష్ బాబు రాజకుమారుడు లా నడిచి వస్తూంటే అమ్మాయిలు మహేష్ ని చూస్తూ సిగ్గుల మొగ్గలే అయ్యారు. మహేష్ లుక్స్ అదరహో అనిపించేలా ఉండటంతో మహేష్ అభిమానుల ఆనందానికి అంతేకాకుండా పోయింది. ప్రస్తుతం మహర్షి టీజర్ ట్రెండ్ అవుతోంది. అలాగే మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అభిమానులు , రాజకీయ నాయకులు, సినిమారంగంలోని వాళ్ళు ఇలా అందరూ వరుసపెట్టి మరీ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

English Title: mahesh babus maharshi teaser review