మహేష్ ఫ్యాన్స్ కోపాన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారో తెలుసా


Mahesh babu's Maharshi trailer on march 21 st

మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది రిలీజ్ విషయంలో . తాజాగా మరోసారి రిలీజ్ మారిపోవడంతో మహేష్ ఫ్యాన్స్ దర్శకులు వంశీ పైడిపల్లి తో పాటుగా ఆ చిత్ర నిర్మాతల మీద చాలా కోపంగా ఉన్నారు . ఇక కొంతమంది అయితే సోషల్ మీడియాలో వంశీ మీద దాడి చేస్తూనే ఉన్నారు .

 

దాంతో అభిమానుల కోపాన్ని తగ్గించడానికి ఈనెల 21న మహర్షి ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ట్రైలర్ ని రిలీజ్ చేయడం ద్వారా మహేష్ అభిమానుల కోపాన్ని కొంతవరకైనా తగ్గించగలం అని భావిస్తున్నారు అందుకే ట్రైలర్ రిలీజ్ కి మొగ్గు చూపారట . ఇక సినిమా మాత్రం మే 9 న రిలీజ్ కానుంది . మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు . మరి ఈ సినిమా రిజల్ట్ ఏమౌతుందో చూడాలి ఎందుకంటే మే నెలలో వచ్చిన మహేష్ చిత్రాలన్నీ డిజాస్టర్ లే !

English Title : Mahesh babu’s Maharshi trailer on march 21 st