ఫుల్ స్వింగ్ లో సర్కారు వారి పాటలు


ఫుల్ స్వింగ్ లో సర్కారు వారి పాటలు
ఫుల్ స్వింగ్ లో సర్కారు వారి పాటలు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ను ఇప్పట్లో మొదలుపెట్టే పరిస్థితి లేదు. కనీసం రెండు నెలల తర్వాత అంటే నవంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సెషన్స్ ను పూర్తి చేయాలని మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ ను కోరినట్లు తెలుస్తోంది. పాటలు మన చేతిలో ఉంటే షూటింగ్ అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చని, దాని వల్ల ఆలస్యం కాదన్నది మహేష్ భావన.

ఆ మాట ప్రకారంగానే పరశురామ్ ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ తో మ్యూజిక్ సెషన్స్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే థమన్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసాడు. సెప్టెంబర్ లో సర్కారు వారి పాట మ్యూజిక్ సెషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నెలలో ఆల్బమ్ రికార్డింగ్ ను కూడా పూర్తి చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి.