సర్కారు వారి పాట ట్రీట్ రెడీ అవుతోంది.. మరి మహేష్ ఫ్యాన్స్?

సర్కారు వారి పాట ట్రీట్ రెడీ అవుతోంది.. మరి మహేష్ ఫ్యాన్స్?
సర్కారు వారి పాట ట్రీట్ రెడీ అవుతోంది.. మరి మహేష్ ఫ్యాన్స్?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో ఒక భారీ షెడ్యూల్ జరిగింది. రెండో షెడ్యూల్ ను ప్లాన్ చేసారు కానీ కోవిద్ కారణంగా అది సాధ్యం కాలేదు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టినా తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో షూటింగ్ ను ఆపక తప్పలేదు.

మరోవైపు సర్కారు వారి పాట నుండి మే 31న ట్రీట్ వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ప్రతీ ఏటా మహేష్ నుండి ఏదో ఒక సినిమా అప్డేట్ రూపంలో అభిమానులకు గిఫ్ట్ వస్తోన్న విషయం తెల్సిందే. మరి ఈసారి సర్కారు వారి పాట టీజర్ కానీ ఫస్ట్ లుక్ కానీ విడుదల చేద్దామని నిర్మాతలు నిర్ణయించారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ ఇలా సెలబ్రేట్ చేయడం కరెక్టా కాదా అన్న ఆలోచన చేసారు నిర్మాతలు. మొత్తానికి సర్ప్రైజ్ ఇవ్వడానికే డిసైడ్ అయ్యారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.