మహేష్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది


mahesh bharath ane nenu first single outమహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు . కాగా ఈరోజు ఉదయం శ్రీరామనవమి ని పురస్కరించుకొని ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట మహేష్ అభిమానులనే కాకుండా యావత్ ప్రేక్షకులను అలరించేలా ఉంది .

భరత్ అనే నేను చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే . మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది . ఇక ఈ భారీ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ఏప్రిల్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కొరటాల శివ అంటే సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ అంశాలను జోడించి తీయడంలో దిట్ట . ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా అదే కోవలో ఉన్నాయి ఇక ఈ సినిమా కూడా అదే కోవలో ఉండనుంది . అయితే మహేష్ గతకొంత కాలంగా డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నాడు కాగా ఆలోటు ని ఈ సినిమా భర్తీ చేస్తుందని అంటున్నారు .