భరత్ అనే నేను ఆడియో వేడుక ఏప్రిల్ 7న


mahesh bharath ane nenu gets audio release dateమహేష్ బాబు హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న భారీ ఎత్తున విడుదల కానుంది , కాగా దానికంటే ముందుగా ఆడియో వేడుక ఏప్రిల్ 7న చేయనున్నారు . అయితే మొదట ఈ వేడుకని విశాఖపట్టణం లో చేయాలనుకున్నారు తర్వాత దాన్ని విజయవాడ కు మార్చారు ఇక ఇప్పుడు తెలుస్తున్న దాని ప్రకారం హైదరాబాద్ లోనే భరత్ అనే నేను చిత్ర ఆడియో వేడుక భారీ ఎత్తున నిర్వహించనున్నారు .

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి . మహేష్ – కొరటాల కాంబినేషన్ లో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ రావడంతో ఈ అంచనాలు ఏర్పడ్డాయి .