మ‌హేష్ భ‌ట్ ని విచారించ‌నున్న పోలీసులు!


మ‌హేష్ భ‌ట్ ని విచారించ‌నున్న పోలీసులు!
మ‌హేష్ భ‌ట్ ని విచారించ‌నున్న పోలీసులు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సుశాంత్ మ‌ర‌ణంపై ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేయ‌డంతో ముంబై పోలీసులు ద‌ర్యాప్తుని వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని ప్ర‌శ్నించారు. సెల‌బ్రిటీల‌ని ప్ర‌శ్నించిన ప్ర‌తీసారి సుశాంత్ కేసు మ‌రో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో ట్విస్ట్ బ‌య‌టికి వ‌చ్చేస్తోంది. ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేష్ భ‌ట్‌ని పోలీసులు విచారించ‌బోతున్నారు.

మ‌రో రెండు రోజుల్లో మ‌హేష్ భ‌ట్ వాగ్మూలం రికార్డు చేయ‌నున్నార‌ట. ఆ త‌రువాత క‌ర‌ణ్ జోహార్ మేనేజ‌ర్‌ని కూడా ఎంక్వైరీకి పిలుస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అత‌ను ఇచ్చే స‌మాధానం క‌రెక్ట్‌గా లేని ప‌క్షంలో క‌ర‌ణ్ జోహార్‌ని విచారించే అవ‌కాశాలు కూడా లేక‌పోలేద‌ని మ‌హారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్ల‌డించారు. సుశాంత్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న న‌టి కంగ‌న ర‌నౌత్కూ స‌మ‌న్లు జారీ చేశామ‌ని కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

సుశాంత్ హ‌ఠాత్తుగా ఆత్మ హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న వృత్తి ప‌రంగా ఒత్తిడిని ఎదుర్కోవ‌డ‌మేన‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో ఆ కోణంలో పోలీసుల విచార‌ణ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు 37 మందిని విచారించారు. మ‌రి కొంత మందిని విచారించ‌నున్నార‌ని తెలిసింది.