మ‌హేష్‌భ‌ట్ ఏమ‌ని వాంగ్మూలం ఇచ్చారు?


మ‌హేష్‌భ‌ట్ ఏమ‌ని వాంగ్మూలం ఇచ్చారు?
మ‌హేష్‌భ‌ట్ ఏమ‌ని వాంగ్మూలం ఇచ్చారు?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ హ‌త్య బాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. సుశాంత్ మ‌ర‌ణంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతో రంగంలోకి దిగిన పోల‌సులు అత‌ని కుటుంబ స‌భ్యుల‌తో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు, సినీ వ‌మ‌ర్శ‌కుల‌ని సైతం విచారించిన విష‌యం తెలిసిందే. సంజ‌య్ లీలా భ‌న్సాలీ నుంచి మ‌హేష్ భ్ వ‌ర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 37 మందికి పైగానే విచారించారు.

పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్‌లో సుశాంత్ ది హ‌త్య కాద‌ని, ఆత్మ హ‌త్యేని తేలినా ఆయ‌న ఫ్యాన్స్‌, శ్రేయోభిలాషులు ఇది ముమ్మాటికీ హ‌త్యేన‌ని వాదిస్తున్నారు. దీంతో ముంబై పోలీసులు విచార‌ణ‌ను వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల మ‌హేష్ భట్‌ని విచారించి ఆయ‌న స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. ఇంత‌కీ విచార‌ణ‌లో సుశాంత్ గురించి మ‌హేష్ భ‌ట్ ఏం చెప్పార‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది.

విచార‌ణ‌లో మ‌హేష్ భ‌ట్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డిచారు. సుశాంత్‌ని తాను కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే క‌లిశాన‌ని, 2018లో ఒక‌సారి, 2019లో మ‌రోసారి క‌లిశాన‌ని, అయితే త‌న‌ని సినిమా కోసం మాత్రం క‌ల‌వ‌లేద‌ని మహేష్ భ‌ట్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. ఇక `స‌డ‌క్ 2` గురించి సుశాంత్‌ని ముందు అనుకుని ఆ త‌రువాత సిద్దార్ధ్ రాయ్ క‌పూర్‌ని తీసుకున్నార‌నే వాద‌న వుంద‌ని ప్ర‌శ్నిస్తే .. సుశాంత్‌ని త‌ను ఏ  సినిమాకు తీసుకోవాల‌నుకోలేద‌ని మ‌హేష్ భ‌ట్ వెల్ల‌డించార‌ట‌. ఇదిలా వుంటే త్వ‌ర‌లో ముంబై పోలీసులు క‌ర‌ణ్ జోహార్‌ని కూడా విచారించ‌నున్నార‌ని తెలిసింది.