మైత్రీతో మ‌హేష్ బిగ్ డీల్ కుదుర్చుకున్నాడా?


Mahesh big deal with Mythri movie makers
Mahesh big deal with Mythri movie makers

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం కోసం మ‌హేష్ భారీ డీల్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా మ‌హేష్ లాభాల్లో వాటా కింద 50 కోట్లు తీసుకున్న విష‌యం తెలిసిందే. తాజా చిత్రానికి కూడా అదే త‌ర‌హాలో బిగ్ డీల్‌ని చేసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో మ‌హేష్ ప్రేక్ష‌కుల ముంద‌కొచ్చిన విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

దాదాపు 200 కోట్లు పైచిలుకు వ‌సూళ్ల‌ని సాధించి మ‌హేష్ కెరీర్‌లోనే భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ త‌న నెక్ట్స్ మూవీ చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి ప‌ర‌శురామ్‌తో త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 ప్ల‌స్ రీల్స్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి మ‌హేష్ పారితోషికం తీసుకోవ‌డం లేదంని, వాటాల రూపంలో దాదాపు 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యూఎస్ వెకేష‌న్‌కి వెళ్లారు. ఇండియా తిరిగి వ‌చ్చాక ప‌ర‌శురామ్‌తో చేయ‌బోతున్న సినిమాకు సంబంధించిన అఫీష‌య‌ల్ అనౌన్స్‌మెంట్ ని వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది.