ఛాలెంజ్ ని పూర్తిచేసిన మహేష్ బాబు కూతురు


mahesh challenge accepted his daughter sitaraటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితార కు ఛాలెంజ్ విసరడంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించి హరితహారం లో పాల్గొని మొక్క నాటింది . సితార చాలా యాక్టివ్ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటికే పలుమార్లు మహేష్ బాబు చిత్రాల్లోని పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీయించుకొని మరీ సోషల్ మీడియా లో పెట్టేలా చేసింది . ఆ వీడియోలతో బాగానే ఫేమస్ అయ్యింది సితార . అలాగే మహేష్ కూడా తన కూతురు డ్యాన్స్ గురించి , మాటల గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేసిన దాఖలాలు ఎన్నో !

అయితే హరితహారంలో భాగంగా కేటీఆర్ విసిరిన సవాల్ ని స్వీకరించి మహేష్ మొక్కలు నాటాడు అంతేకాదు తనకూతురు సితార కు అలాగే తనయుడు గౌతమ్ కు సవాల్ విసిరాడు మహేష్ . దాంతో తండ్రి విసిరిన సవాల్ ని స్వీకరించి మొక్క నాటడమే కాదు పచ్చదనం గురించి వాతావరణ మార్పుల గురించి భవిష్యత్ తరం వాళ్ళు తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది కూడా . చిన్న వయసులోనే పర్యావరణం గురించి పట్టించుకుంటున్న సితార నిజంగా గ్రేటే !

English Title: mahesh challenge accepted his daughter sitara