సుకుమార్ ని విమర్శించలేదు : మహేష్ బాబు


సుకుమార్ ని విమర్శించలేదు : మహేష్ బాబు
మహేష్ బాబు

నేను సుకుమార్ ని విమర్శించినట్లు మీడియాలో పలు కథనాలు వచ్చాయి కానీ నేను సుకుమార్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ వివరణ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు . మహర్షి చిత్రం మే 9 న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మహేష్ తన వ్యాఖ్యల పట్ల రెజినా దుమారానికి వివరణ ఇచ్చాడు . వంశీ పైడిపల్లి నాకోసం రెండేళ్లు ఎదురు చూసాడు దాంతో రెండు నెలలు కూడా వెయిట్ చేసే దర్శకులు లేని ఈరోజుల్లో వంశీ రెండేళ్లు వెయిట్ చేసాడు అని చెప్పే సందర్భంలో మాట్లాడాను తప్ప సుకుమార్ పై సెటైర్ వేయలేదని స్పష్టం చేసాడు .

మహర్షి సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నానని , అది పూర్తిగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ మెంట్ ఫిలిం అని నాకు కూడా చేంజ్ కావాలి కాబట్టి అనిల్ రావిపూడి తో సినిమా చేసున్నానని తెలిపాడు మహేష్ . మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ మాట్లాడిన మాటలు సుకుమార్ పై విమర్శలుగా ప్రచారం కావడంతో అది ఇంకా పెద్దది కాకముందే వివరణ ఇస్తే బాగుంటుందని భావించిన మహేష్ ఈ వివరణ ఇచ్చాడు . అన్నట్లు సుకుమార్ తో అలాగే త్రివిక్రమ్ , ఎస్ ఎస్ రాజమౌళి లతో తన తదుపరి సినిమాలు ఉంటాయని తెలిపాడు మహేష్ .