మహేష్ కూతురు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్


Sitara
Sitara

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది . ఇప్పటివరకు పలువురు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగా తాజాగా ఆ జాబితాలో మహేష్ బాబు కూతురు సితార కూడా చేరింది . సోషల్ మీడియాలో నిత్యం తన పోస్ట్ లను పెడుతుంది సితార . అయితే ఇన్నాళ్లు అవి సోషల్ మీడియా పేజ్ ల లాగే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది ఏ అండ్ ఎస్ అని .

ఈ యూట్యూబ్ లో సితార మాత్రమే కాకుండా దర్శకులు వంశీ పైడిపల్లి కూతురు కూడా జాయిన్ అయ్యింది . ఈ ఇద్దరూ కలిసి బొమ్మలకు కలర్స్ ని నింపే క్రమంలో పోటీ పడ్డారు . దాన్ని వీడియో తీసి తమ యూట్యూబ్ ఛానల్ లో పెట్టేసారు .సితార కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి వెంటనే సితార ఛానల్ ఫేమస్ అవుతోంది .