మహేష్ గెటప్ కొత్తగా ఉంటుందట


mahesh different getup in vamsi paidipalli filmమహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు , ప్రస్తుతం స్పెయిన్ లో తన కుటుంబంతో కలిసి వేసవి విడిది కి వెళ్ళాడు . స్పెయిన్ నుండి తిరిగి వచ్చాక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు అశ్వనీదత్దిల్ రాజు లు సంయుక్తంగా నిర్మించనున్నారు . రాయలసీమ నేపథ్యం కూడా మహేష్ సినిమా టచ్ చేయనుంది దాంతో ఆ సినిమా కోసం మహేష్ కొత్త గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది .

గుబురు గడ్డం తో పాటు మీసం కూడా మరింత పదునుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు వంశీ పైడిపల్లి . ఇటీవల విడుదలైన భరత్ అనే నేను చిత్రంలో మహేష్ ఒక సన్నివేశంలో కోర మీసంతో కనిపిస్తాడు కాగా ఆ సీన్ కు మంచి అప్లాజ్ వచ్చింది దాంతో మీసకట్టు అలా ఉంటె బాగుంటుంది అని భావిస్తున్నారట . అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుంది కానీ రాయలసీమ ప్రస్తావన ఉంటుందట . మహేష్ సరసన పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసారు . భరత్ అనే నేను చిత్రం ఇచ్చిన జోష్ లో ఉన్నాడు మహేష్ . ఇక వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తూనే సుకుమార్ సినిమాకు కూడా రెడీ అవనున్నాడు .