అనిల్ రావిపూడి విల్లా ఖ‌రీదు అంతా?

Mahesh director Anil ravipudi buys 12 crore villa
Mahesh director Anil ravipudi buys 12 crore villa

స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌ళ్లు చెదిరే విల్లా  కొన్నారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ప్రస్తుతం `ఎఫ్ 3` చిత్రాన్ని విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌‌తేజ్‌ల తో తెర‌కెక్కిస్తూ బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపుడి హైదరాబాద్ లోని అత్య‌తం పోష్ ఏరియాలో ఖరీదైన విల్లా కొన్నట్లు చెబుతున్నారు. కొండపూర్‌లో ఈ విల్లాని కొనుగోలు చేయడానికి స్టార్ డైరెక్టర్ రూ .12 కోట్లకు పైగా వెచ్చించిన‌ట్లు సమాచారం.

ఇంటీరియర్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాలేదు. విల్లా సిద్ధమైన తర్వాత అనిల్ రావిపూడి తన కుటుంబంతో విల్లాలోకి వెళ్ల‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి కెరీర్ మాంచి స్వింగులో వుంది. ఆయ‌న ఏ సినిమా చేసిన సూప‌ర్ హిట్టే. గ‌త ఏడాది ఆయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో చేసిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడిగా అనిల్ రావిపూడి కెరీర్‌నే మార్చేసింది. ప్ర‌స్తుతం అనిల్ ప్ర‌తి చిత్రాల‌నికి దాదాపు 10 కోట్లకు పైగారే వసూలు చేస్తున్నాడ‌ట‌.

ప్రస్తుతం `ఎఫ్ 2` సీక్వెల్ కోసం వెంకటేష్, వరుణ్ తేజ్ ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నారు.దీనితో పాటు త‌న స్నేహితుడు కృష్ణ‌తో క‌లిసి `గాలీ సంపత్‌` చిత్రానికి నిర్మాత‌గా, ద‌ర్శక‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌తో పాటు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. త్వ‌ర‌లో మ‌ళ్లీ మహేష్ బాబుతో క‌లిస ఓ భారీ చిత్రం చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌.