మ‌హేష్ కొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్నారా?



మ‌హేష్ కొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్నారా?
మ‌హేష్ కొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్నారా?

ఈ ఏడాది ప్రారంభంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని శుభారంభాన్ని అందించారు మ‌హేష్‌. ఈ మూవీ మ‌హేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ చిత్రం త‌రువాత మ‌హేష్ న‌టిస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. మైత్రీ మూవీమేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్తిస్తున్నాయి.

కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంపై ప‌లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ పాత్ర నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. విల‌న్ పాత్ర కోసం క‌న్న‌డ హీరోలు ఉపేంద్ర‌, సుదీప్‌ల‌ని చిత్ర బృందం సంప్ర‌‌దిస్తోంద‌ని, త‌మిళ హీరో అర‌వింద‌స్వామిని కూడా అడుగుతున్నార‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్రంలో తొలిసారిగా మ‌హేష్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

`కొడుకు దిద్దిన కాపురం` చిత్రంలో బాల న‌టుడిగా మ‌హేష్ అప్ప‌ట్లో ద్విపాత్రాభిన‌యం చేసిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ హీరోగా `రాజ‌కుమారుడు`తో జ‌ర్నీ మొద‌లుపెట్టాక ఇప్ప‌టి వ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేయ‌లేదు. ఇదే తొలిసారి. మరి ఈ వార్త  నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పండ‌గే. చాలా ఏళ్లుగా మ‌హేష్ ద్విపాత్రాభిన‌యం చేస్తే కళ్లారా చూడాల‌ని ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక `స‌ర్కారు వారి పాట‌`తో తీరుతుందో లేదో తెలియాలంటే ప‌ర‌శురామ్ వెల్ల‌డించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.