మహేష్ లుక్స్ పై టాలీవుడ్ సెలబ్రిటీల కామెంట్స్


మహేష్ లుక్స్ పై టాలీవుడ్ సెలబ్రిటీల కామెంట్స్
మహేష్ లుక్స్ పై టాలీవుడ్ సెలబ్రిటీల కామెంట్స్

తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ లుక్స్ ఉన్న హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చేపేరు కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబుదే. 40ల్లో ఉన్నా కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా కనిపించే మహేష్ అందం విషయంలో మిగతా టాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ విషయంలో డిబేట్లు కూడా అవసరం లేదు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఇప్పటికే ఎన్నో సార్లు కితాబు అందుకున్నాడు మహేష్. టైమ్స్ మ్యాగజైన్ ఏటా విడుదల చేసే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో ఫరెవర్ డిజరైబుల్ వ్యక్తిగా మహేష్ నిలిచాడు. ఇండియాలో బాలీవుడ్ లో నలుగురు హీరోల తర్వాత సౌత్ నుండి ఈ గౌరవం దక్కిన ఒకే ఒక్క హీరో మహేష్ బాబు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహేష్ ఇంటిపట్టునే ఉండి తన ఫ్యామిలీతో కలిసి సమయాన్ని గడుపుతున్న విషయం తెల్సిందే. నమ్రత ఎప్పటికప్పుడు వారి ఇంటి విశేషాలను తెలుపుతూ ఫ్యాన్స్ కు కూడా ఉత్సాహాన్ని అందిస్తోంది. అయితే రీసెంట్ గా నమ్రత పోస్ట్ చేసిన ఫొటోలో మహేష్ చాలా అందంగా, గ్రీకువీరుడిలా ఉండడం అందరినీ ఆకట్టుకుంది. దీనిపై టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించడం విశేషం.

నిర్మాత బండ్ల గణేష్ మహేష్ ఫోటోను ట్వీట్ చేసి హాలీవుడ్ హీరోలా మహేష్ ఉన్నాడని తెలిపాడు. అలాగే బ్రహ్మాజీ కూడా ట్వీట్ లో బాగా మగ్గిన బంగినపల్లి మామిడిపండులా మహేష్ ఉన్నాడని తెలపడం విశేషం. సెలబ్రిటీలకే ఇలా ఉంటే ఇక మాములు జనాలు ఎలా అనుకుంటున్నారో.