గద్దలకొండ గణేష్ కు ఫిదా అయిన మహేష్


Mahesh heaps praises on Gaddalakonda Ganesh
Mahesh heaps praises on Gaddalakonda Ganesh

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏదైనా సినిమా నచ్చిందంటే దాన్ని పొగడకుండా ఉండలేడు. సోషల్ మీడియాలో దాని గురించి కచ్చితంగా స్పందించాడు. రీసెంట్ గా సైరా నరసింహారెడ్డి ట్రైలర్ తనకు తెగ నచ్చేసిందని, సినిమా కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే.

కొద్దిసేపటి క్రితం గద్దలకొండ గణేష్ చిత్రం చూసి ఫిదా అయిపోయిన మహేష్, ఆ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. “గద్దలకొండ గణేష్ చిత్రాన్ని చూసి ఆద్యంతం ఎంజాయ్ చేశాను. గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ సూపర్. హరీష్ శంకర్ దర్శకత్వం చాలా బాగుంది. గద్దలకొండ గణేష్ టీమ్ కు నా అభినందనలు” అని ట్వీట్ చేసాడు.

మహేష్ ట్వీట్ తో గద్దలకొండ గణేష్ టీమ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ఇద్దరూ ఆ ట్వీట్ కు రియాక్ట్ అయ్యారు. మహేష్ వంటి సూపర్ స్టార్ నుండి అభినందనలు రావడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు అన్నారు.