శృంగారంలో పీక్స్ …… మహేష్ హీరోయిన్


mahesh heroine kiara advani intimate scene controversyమహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో కైరా అద్వానీ నటించిన విషయం తెలిసిందే . మహేష్ సరసన నటించిన కైరా కు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోంది ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో వరుసగా బుక్ అయ్యింది దాంతో ఆమె ఒక్కసారిగా తెలుగునాట కూడా స్టార్ హీరోయిన్ అయిపొయింది . అయితే అలాంటి కైరా అద్వానీ తాజాగా ఓ శృంగార సన్నివేశంలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ” లస్ట్ స్టోరీస్ ” ఎపిసోడ్ లో కైరా అద్వానీ రెచ్చిపోయిన తీరు షాక్ కి గురి చేయగా ఆ సీన్ బ్యాగ్రౌండ్ లో వచ్చే పాట మరింత వివాదాన్ని రాజేస్తోంది .

భర్త తో శృంగార అనుభవం సంతృప్తికరంగా లేకపోవడంతో భావప్రాప్తి కోసం కైరా అద్వానీ వైబ్రేటర్ ని వాడుతూ స్వయం తృప్తి పొందే సన్నివేశం అది . కాగా ఆ సన్నివేశానికి బ్యాగ్రౌండ్ లో లతా మంగేష్కర్ పాడిన ” కబీ ఖుషీ కబీ ఘమ్ ” పాట వస్తుంది . లతా మంగేష్కర్ పాడిన పాట దేశభక్తి కి సంబందించినది అయితే ఇక్కడ కనిపించే సీన్ శృంగారం దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . అయితే ఆ విమర్శలను పక్కన పెడితే మహేష్ భామ అయినా కైరా అద్వానీ అలాంటి సన్నివేశంలో నటించడంతో అందరూ షాక్ అవుతున్నారు .

English Title: mahesh heroine kiara advani intimate scene controversy