అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మహేష్ సినిమా


mahesh impressed with sandeep reddy vanga script

అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా మహేష్ బాబు తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . అర్జున్ రెడ్డి విడుదలైన సమయంలో మహేష్ బాబు అర్జున్ రెడ్డి దర్శకుడి తో పాటుగా ఆ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేస్తూ ట్వీట్ చేసాడు అప్పుడే ఈ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు గుసగుసలు వినిపించాయి .

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి మహేష్ బాబు కథ చెప్పడం దానికి మహేష్ ఓకే చెప్పడం జరిగిపోయిందట ! ఇక పూర్తి స్క్రిప్ట్ ని సందీప్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు దాని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు . కాగా ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ నటించే సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది . ఇక మహేష్ ఆ సినిమాలో మెకానిక్ గా నటించనున్నాడట .