ఎక్స్‌క్లూజివ్‌: మ‌హేష్ క‌న్ఫ్యూజ‌న్‌లో వున్నారా?ఎక్స్‌క్లూజివ్‌: మ‌హేష్ క‌న్ఫ్యూజ‌న్‌లో వున్నారా?
ఎక్స్‌క్లూజివ్‌: మ‌హేష్ క‌న్ఫ్యూజ‌న్‌లో వున్నారా?

సూప‌ర‌స్టార్ మ‌హేష్ ఈ సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో భారీ హిట్‌ని సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌ని సాధించి మ‌హేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా రికార్డు నెల‌కొల్పింది. ఈ సినిమా స‌క్సెస్‌ని సెల‌బ్రేట్ చేసుకున్న మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే.

తిరిగి ఇండియా వ‌చ్చాక వంశీ పైడిప‌ల్లితో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన మ‌హేష్ స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ స్థానంలో ప‌ర‌శురామ్‌కి ఓకే చెప్పేశారు. గ‌త కొంత ఆక‌లంగా మ‌హేష్‌తో సినిమా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఎదురుచూస్తున్న ప‌ర‌శురామ్ ఈ చిత్ర క‌థ‌కు ప్ర‌స్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నాడ‌. ఇదిలా వుంటే మ‌హేష్ మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని ప్ర‌చారం మొద‌లైంది.

ఇటీవ‌ల `భీష్మ‌` చిత్రంతో టెర్రిఫిక్ హిట్‌ని సొంతం చ‌సుకున్న వెంకీ కుడుముల హీరో మ‌హేష్‌కి క‌థ వినిపించార‌ట‌. స్టోరీ సింపుల్‌గా కొత్త‌గా వుండ‌టం, వెంకీ కుడుముల న‌రేట్ చేసిన స్టైల్ న‌చ్చ‌డంతో మ‌హేష్ అత‌నికీ కూడా ఓకే చెప్పేశార‌ట‌. లైన్ బాగుంది. డెవ‌ల‌ప్ చెయ్ బాగొస్తే క‌లిసి చేద్దాం అని చెప్పార‌ట‌. దీంతో వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ని సిద్ధం చేసేప‌నిలో ప‌డ్డార‌ట‌. ఈ రెండు క‌థ‌లు సిద్ధ‌మైతే ముందు ఏ క‌థ‌ని ప‌ట్టాలెక్కించాల‌నే క‌న్‌ఫ్యూజ‌న్‌లో మ‌హేష్ వున్నాడ‌ని తెలుస్తోంది. కొత్త చిత్రాన్ని మాత్రం జూన్‌లో మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారట‌. అది ఎవ‌రి స్క్రిప్ట్ అన్న‌ది తెలియాలంటే మైత్రీ వారు క్లారిటీ ఇవ్వాల్సిందే.