మరోసారి దర్శకుడ్ని గుడ్డిగా నమ్మేస్తున్న మహేష్


Mahesh Babu
మరోసారి దర్శకుడ్ని గుడ్డిగా నమ్మేస్తున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక అలవాటుంది. అది ఒక్కోసారి మంచి చేస్తే, చాలాసార్లు చెడు కూడా చేసింది. అయినా కానీ మహేష్ తన పంథాను మాత్రం మార్చుకోలేదు. ఇంతకీ ఆ పంథా ఏమిటంటే.. దర్శకుడ్ని గుడ్డిగా నమ్మేయడం. ఒక్కసారి దర్శకుడికి ఓకే చెబితే ఇక మరో ప్రశ్న లేకుండా అతను ఏది చెప్తే అది చేస్తాడు మహేష్. అదే దర్శకుడు అమితంగా నచ్చేస్తే కనుక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో సినిమాకు కూడా ఓకే చెప్పేస్తాడు.

మహేష్ మరోసారి ఇదే పని చేయబోతున్నాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు మహేష్. దర్శకుడు అనిల్ రావిపూడి పనితనంతో ఇంప్రెస్ అయిన మహేష్, మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడట. సరైన కథతో వస్తే మరో సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చాడట మహేష్. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఒక సినిమా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇద్దరూ కలిసి పనిచేస్తారని వినికిడి. చూద్దాం మరి ఏం జరుగుతుందో!