చిరు కోసం మ‌హేష్‌ 30 డేస్ ఇచ్చేశాడా?


చిరు కోసం మ‌హేష్‌ 30 డేస్ ఇచ్చేశాడా?
చిరు కోసం మ‌హేష్‌ 30 డేస్ ఇచ్చేశాడా?

టాలీవుడ్ సినిమా వ‌తావ‌ర‌ణం స‌మూలంగా మారుతోంది. `బాహుబ‌లి` త‌రువాత మ‌న సినిమాల స్థాయి, వ‌ర‌ల్డ్ వైడ్‌గా మార్కెట్ పెర‌గ‌డంతో హీరోలు, ద‌ర్శ‌కులు కూడా ఏదైనా కొత్త‌గా చేయాల‌ని, వ‌ర‌ల్డ్ వైడ్‌గా వున్నా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం కోసం కొత్త కొత్త ప్ర‌యేగాలు. కొత్త కొత్త కాంబినేష‌న్ల‌ని సెట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కొత్త కాంబినేష‌న్‌ని సెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరో ఆయ‌న 152 చిత్రాన్ని కొర‌టాల శివ రూపందిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ప్ర‌జానాట్య‌మండ‌లి కార్య‌క‌ర్త‌గా, దేవాదాయ శాఖ అధికారిగా క‌నిపించ‌బోతున్నారు. అయితే ఇందులో ఓ న‌క్స‌లైట్ నాయ‌కుడికి సంబంధించిన కీల‌క అతిథి పాత్ర ఒక‌టి వుంద‌ట‌. ముందు ఆ పాత్ర‌ని రామ్‌చ‌ర‌ణ్ చేత చేయించాల‌నుకున్నార‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్‌` షెడ్యూల్‌లో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఆ స్థానంలో మ‌హేష్‌ని సంప్ర‌దించార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ ప్ర‌చారం నిజ‌మేన‌ని విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, హీరో రామ్‌చ‌ర‌ణ్ హీరో మ‌హేష్‌ని అతిథి పాత్ర కోసం సంప్ర‌దించార‌ని, క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డం, చిరు, కొర‌టాల సినిమా కావ‌డంతో వెంట‌నే అంగీక‌రించార‌ని, ఇందు కోసం 30 రోజులు కాల్షీట్స్ కూడా మ‌హేష కేటాయించారని తెలిసింది.