మహేష్ స్టిల్ పై విమర్శల వర్షం


mahesh latest still from sarileru neekevvaru receives criticism
mahesh latest still from sarileru neekevvaru receives criticism

దసరా పండగ వచ్చేసింది. టాలీవుడ్ లో కూడా వివిధ సినిమాలు దసరా పండగకు తమ సినిమాలకు సంబంధించిన స్టిల్స్, ట్రైలర్స్, టీజర్స్ విడుదల చేసారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన స్టిల్ ఒకటి వదిలారు. ఫ్యాన్స్ కు కనువిందు చేసేలా మాస్ పోస్టర్ ఒకటి వదిలారు.

అందులో మహేష్ గొడ్డలి పట్టుకుని కొండారెడ్డి బురుజు సెంటర్ ముందు నిల్చున్న స్టిల్ నిజంగా ఫ్యాన్స్ కు సినిమా మీద ఆసక్తి పెంచేలానే ఉంది. ఇంతవరకూ బానే ఉంది వ్యవహారం. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మహేష్ గత నాలుగైదు సినిమాల నుండి ఏదో ఒక ఆయుధం పట్టుకుని నిల్చున్న స్టిల్ ను పక్కపక్కన పెట్టి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆయుధం మారుతోంది, సినిమాలు మారుతున్నాయి కానీ స్టిల్ మారట్లేదు, మహేష్ లుక్స్ మారట్లేదు, ఎక్స్ప్రెషన్ కూడా మారట్లేదు అంటూ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు.

దీనికి మహేష్ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు మొదలుపెట్టడంతో ట్విట్టర్ ఫ్యాన్ వార్ ఒక రేంజ్ లో జరుగుతోందనే చెప్పాలి. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అంచనాలు పెంచాలనుకుంటే ఇలా విమర్శలు పెరగడం టీమ్ ను కొంత కలవరానికి గురి చేస్తోంది.