మహేష్ సినిమాల లైనప్.. నిజమైతే సూపరే!


మహేష్ సినిమాల లైనప్.. నిజమైతే సూపరే!
మహేష్ సినిమాల లైనప్.. నిజమైతే సూపరే!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాక్ తో సంబంధం లేకుండా గత మూడు సినిమాలతో హిట్లు కొట్టేసి హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. భరత్ అనే నేను, మహర్షి తర్వాత ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు అంటూ మరో హిట్ కొట్టేసి హ్యాట్రిక్ ను పూర్తి చేసాడు. సరిలేరు నీకెవ్వరు అయితే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయి కూర్చుంది. టాక్ యావరేజ్ గానే వచ్చినా సంక్రాంతి ఫెస్టివల్ అడ్వాంటేజ్ ను పూర్తిగా ఉపయోగించుకుని ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాను మొదలుపెట్టడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఏప్రిల్ లేదా మే నుండి ఈ సినిమా మొదలుకావొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది.

ఇక వంశీ పైడిపల్లి సినిమా తర్వాత మహేష్ నటించబోయే నాలుగు సినిమాల లైనప్ ఫిక్స్ అయిందని అంటున్నారు. ముందుగా అనిల్ రావిపూడితో వచ్చే ఏడాది సినిమాను మొదలుపెడతాడని, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా సినిమా ఉండొచ్చని అంటున్నారు. వచ్చే ఏడాది పరిస్థితి బట్టి ఈ ఇద్దరిలో ఒకరి సినిమా ముందుకు వెళుతుంది ఒకరి సినిమా వెనక్కి వెళుతుందని అంతే కానీ ఇద్దరితో మహేష్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు పూర్తయ్యేసరికి 2022 వచ్చేస్తుంది. దాని తర్వాత తనకు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో కూడా మహేష్ నటించబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ లోపు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కానీ రాజమౌళి సినిమా కానీ కన్ఫర్మ్ అయితే సినిమాల లైనప్ కొంచెం అటూ ఇటూ అవ్వొచ్చు కానీ వచ్చే నాలుగేళ్లలో ఈ దర్శకులతోనే మహేష్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిని కాదని మరొక దర్శకుడి కథ కూడా వినే తీరిక ఇప్పుడు మహేష్ కు లేదు. అయితే ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పలేం.