సైరాకు చిరు, మహేష్ ప్రశంసలు


సైరాకు చిరు, మహేష్ ప్రశంసలు
సైరాకు చిరు, మహేష్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి పడిన కష్టానికి, సురేందర్ రెడ్డి పనితనానికి అందరూ ఫిదా అవుతున్నారు. సాధారణ ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ వారు కూడా సైరాను పొగడకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా తనకు ఏదైనా సినిమా నచ్చితే వెంటనే స్పందించే అలవాటున్న మహేష్ బాబు, సైరాను.. చిరంజీవిని ఓ రేంజ్ లో పొగిడేసాడు.

ఆ స్కేల్, ఆ గ్రాండ్ లుక్, ఆ విజువల్స్ అన్నీ ఒకెత్తు, చిరంజీవి గారి నటన మరోవైపు.. సైరా కచ్చితంగా చూడాల్సిన చిత్రం. రామ్ చరణ్, సురేందర్ రెడ్డి అండ్ టీమ్ కు అభినందనలు. రత్నవేలు గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. అత్యద్భుతంగా ఉంది. ఇటీవలే కాలంలో ది బెస్ట్ అని చెప్పవచ్చు అని ట్వీట్ చేసాడు మహేష్.

నాని కూడా సైరాను పొగిడేసాడు. తాను విదేశాల్లో షూటింగ్ కారణంగా సైరా చూడలేకపోయినా ఇండియాలో బాక్సాఫీస్ ఘరానా మొగుడు ఈజ్ బ్యాక్ అనే టాక్ వినిపించిందని, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అన్నట్టు ఉందని నాని ప్రశంసించాడు.

Credit: Twitter