మ‌హేష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిందా?మ‌హేష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిందా?
మ‌హేష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిందా?

సంక్రాంతికి మ‌హేష్ `సరిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దేశ భ‌క్తితో పాటు ఓ సైనికుల‌ త్యాగాల‌ని ప్ర‌ధాన క‌థాంశంగా తీసుకుని దానికి మంచి సందేశాన్ని జోడించి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించి దాదాపు 200 కోట్ల‌పైచిలుకు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి రికార్డు సృష్టించింది.

ఈ సినిమా త‌రువాత యూఎస్‌లో ఫ్యామిలీలో మ‌హేష్ వెకేష‌న్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి వ‌చ్చాక ప‌ర‌శురామ్‌తో సినిమా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా వుంటే మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారని, దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆయ‌న‌తో నిర్మాత సాజిద్ నాదియావాలా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో ఆయ‌న నిర్మించిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి సాజిద్ నాదియావాలా సీక్వెల్‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ర‌ణ్‌వీర్‌సింగ్ ఓ హీరోగా న‌టించ‌నున్న ఈ చిత్రంలో మ‌రో హీరోగా మ‌హేష్ అయితే బాగుంటుంద‌ని ఆయ‌న‌ను నిర్మాత సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి రోహిత్‌శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌. అయితే మ‌హేష్ మాత్రం ఇంత వ‌ర‌కు త‌న అభిప్రాయం చెప్ప‌లేద‌ని, ఇది వ‌ర్క‌వుట్ కావ‌డం కష్ట‌మేన‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.