మ‌హేష్ కాదా.. రామ్‌ర‌చ‌ణ్ ఫైన‌ల‌య్యాడా?


మ‌హేష్ కాదా.. రామ్‌ర‌చ‌ణ్ ఫైన‌ల‌య్యాడా?
మ‌హేష్ కాదా.. రామ్‌ర‌చ‌ణ్ ఫైన‌ల‌య్యాడా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని కొర‌టాల శివ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి హీరో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది.

ఇందులోని ఓ కీల‌క అతిథి పాత్ర‌లో ప్రిన్స్ మ‌హేష్ న‌టిస్తున్నార‌ని, ఈ పాత్ర చాలా శ‌క్తిమంతంగా వుంటుంద‌ని, 30 రోజులు కూడా కేటాయించాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ పాత్ర‌లో మ‌హేష్ న‌టించ‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర‌ని రామ్‌చ‌ర‌ణ్ చేస్తున్న‌ట్టు లేటెస్ట్ అప్‌డేట్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.

ముందు ఈ పాత్ర కోసం చ‌ర‌ణే అనుకున్నా `ఆర్ ఆర్ ఆర్‌` కార‌ణంగా రామ్‌చ‌ర‌ణ్ స్థానంలో మ‌హేష్‌ని న‌టింప‌జేయాల‌ని టీమ్ భావించి ఆయ‌న‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రాజ‌మౌళి అనుమ‌తివ్వ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ కున్న ప్ర‌ధాన‌ అడ్డంకులు తొల‌గిపోయాయ‌ట‌. దీంతో చిరు చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టించ‌డానికి లైన్ క్లియ‌ర్ అయింద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.