సక్సెస్ వచ్చిన వారిని మహేష్ వదలడా?


సక్సెస్ వచ్చిన వారిని మహేష్ వదలడా?
సక్సెస్ వచ్చిన వారిని మహేష్ వదలడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్ర షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతుండడంతో మహేష్ తీరిక లేకుండా ఉన్నాడు. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తారు. దాని తర్వాత మహేష్ ఏ చిత్రం చేయనున్నాడనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి, ప్రశాంత్ నీల్ తో టచ్ లో ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు విడుదల అవ్వగానే మహేష్ బాబు ముందుగా వంశీ పైడిపల్లి సినిమాను చేస్తాడట. మహర్షి విడుదల కాక ముందే వంశీ పైడిపల్లి కథ చెప్పాడట. ఈ లైన్ కు ఇంప్రెస్ అయిన మహేష్ సినిమా చేద్దామని మాట ఇచ్చాడట.

దీని తర్వాత కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నాడు. ఇటీవలే మహేష్, ప్రశాంత్ నీల్ కు మధ్య మీటింగ్ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. వంశీ పైడిపల్లి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇలా హిట్ దర్శకుల కాంబినేషన్ లో సినిమా చేయాలని మహేష్ కు ఆ ఆరాటం ఎందుకో అని కామెంట్స్ వినపడుతున్నాయి.