ఏదైనా మూడు నెల‌ల త‌రువాతే!Mahesh plans three months break
Mahesh plans three months break

భారీ చిత్రాలల్లో న‌టించి క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపే స్టార్ హీరోలు తరువాత చిన్న బ్రేక్ ఇస్తుంటారు. స్టార్ హీరో మ‌హేష్ కూడా బ్రేక్ తీసుకోబోతున్నార‌ట‌. మహేష్ న‌టించిన భారీ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా టాక్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

మ‌హేష్ `బ్ర‌హ్మాత్స‌వం` నుంచి వ‌రుస షూటింగ్‌ల‌తొ బిజీగా గ‌డిపేస్తున్నారు. బ్ర‌హ్మాత్స‌వం, స్పైడ‌ర్ డిజాస్ట‌ర్‌లుగా నిల‌వ‌డంతో కంగారుప‌డ్డ మహేష్ భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు… వ‌ర‌కు రెస్ట్ లేకుండా వ‌ర్క్ చేశారు. ప్ర‌స్తుతం `స‌రిలేరు నీకెవ్వ‌రు` భారీ విజ‌యాన్ని సాధించి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని సాధిస్తున్న నేప‌థ్యంలో చాలా హ్యాపీగా వున్న మహేష్ బ్రేక్ తీసుకోబోతున్నారట‌.

మూడు నెల‌లు బ్రేక్ తీసుకున్న త‌రువాతే త‌దుప‌రి చిత్రానికి సిద్ధం కావాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ రోజే చిత్ర యూనిట్‌తో క‌లిసి తిరుప‌తి వెళ్లిన మ‌హేష్ శ్రీ‌వారిని ద‌ర్శించుకుని తిరిగి వ‌చ్చాక వెకేష‌న్ కోసం అమెరికా వెళ్ల‌నున్న‌ట్టు తెలిసింది. మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లితో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.