జ‌క్క‌న్న‌- మ‌హేష్ మూవీకి ఊహ‌కంద‌ని నేప‌థ్యం?

Mahesh Rajamouli film will be a forest adventure
Mahesh Rajamouli film will be a forest adventure

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో ప్ర‌స్తుతం రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న వియం తెలిసిందే. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఛారిత్ర‌క యోధుల క‌థ‌కి ఫాంట‌సీ అంశాల్ని జోడించి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత జ‌క్క‌న్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి రానున్న ఈ మూవీపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఏ నేప‌థ్యంలో తెర‌పైకి తీసుకురాబోతున్నారా అని మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా ఆ చ‌ర్చ‌కు స‌మాధానం ల‌భించిన‌ట్టుగా తెలుస్తోంది. రాజ‌మౌళి ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్రసాద్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ కోసం ఊహ‌కంద‌ని క‌థ‌ని సిద్ధం చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఫారెస్ట్ నేప‌థ్యంలో ఈ మూవీ సాగుతుంద‌ని, ఆఫ్రికా నేప‌థ్యంలో ఈ మూవీ కోసం అదిరిపోయే పోరాట ఘ‌ట్టాల్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇంత వ‌ర‌కు ఇండియ‌న్ తెర‌పై ఎవ‌రూ చూడ‌ని ఫారెస్ట్ ఎడ్వెంచ‌ర్ ఫిల్మ్ ఇద‌ని తెలుస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలోనే ఈ మూవీ స్క్రిప్ట్‌ని రాజ‌మౌళి, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ లాక్ చేసిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశాలు వున్నాయ‌ని ప‌లు ఇంగ్లీష్ డైలీలు వెల్ల‌డిస్తున్నాయి.