
స్టార్ హీరో మహేష్ ఖతాలో మరో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ ఫ్యాన్స్‌కి అందుబాటులో వుంటున్న మహేష్ సోషల్ మీడియాలో రేర్ ఫీట్‌ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోగా టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా అభిమానుల్ని సొంతం చేసుకున్న మహేష్ ని సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా ఆరు మిలియన్లు (60 లక్షలు) దాటింది.
దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ సిక్స్ మిలియన్ క్రాస్ చేసిన సీడీపీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే మహేష్ ఇప్పటికే ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ని క్రాస్ చేశారు. ఇన్ స్టాలో తాజాగా 6 మిలియన్ క్రాస్ చేయడం విశేషం. లాక్డౌన్ సందర్భంగా మహేష్ నిత్యం ట్వీట్లతో ప్రతీ ఒక్కిరినీ కరోనా విషయంలో జాగ్రత్తగా వుండాలని హెచ్చరించడమే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారు ఈ పాండమిక్ లో ముందు వరుసలో వుండి సహాయక చర్యల్లో పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ వార్తల్లో నిలిచారు మహేష్.
ఇన్ స్టాలో రేర్ ఫీట్‌ని సాధించిన టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో వున్నారు. ఇన్ స్టాగ్రామ్‌లో హీరోల్లో అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 9 మిలియన్లు. తరువాత స్థానంలో 6 మిలియన్ల పాలోవర్స్‌ని అధిగమించిన హీరోగా మహేష్ నిలిచారు. ప్రస్తుతం ఆయన `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.