సర్కారు వారి పాటలో మహేష్ పాత్ర ఎలా ఉంటుంది?

సర్కారు వారి పాటలో మహేష్ పాత్ర ఎలా ఉంటుంది?
సర్కారు వారి పాటలో మహేష్ పాత్ర ఎలా ఉంటుంది?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రకటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మే 31న ఈ సినిమాను ప్రకటించారు. సెప్టెంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైపోగా పరశురామ్ కాస్ట్, క్రూ ను తీసుకునే పనిలో ఉన్నాడు. ఆగష్టుకల్లా ప్రీ ప్రొడక్షన్ పనులను ఓ కొలిక్కి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా ముందుగా పరిమిత సంఖ్యలో షూటింగ్స్ చేసుకోవడానికి షెడ్యూల్స్ ను మార్పు చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఒక సామజిక అంశంపై చర్చిస్తూనే పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలున్న చిత్రం ఇదని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఇక ఈ సినిమాలో మహేష్ రోల్ ఇదేనంటూ ఒక సరికొత్త వార్త మొదలైంది.

ఈ చిత్రంలో మహేష్ బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో కనిపించనున్నాడట. ఒక భారీ స్కామ్ చేసి వేలాది కోట్లు ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న ఒక బడా వ్యాపారవేత్త ఆట కట్టించి ఆ అప్పును ఎలా వసూలు చేయించాడన్నది ఈ చిత్ర కథాంశమట. మొదట్లో మహేష్ పాత్ర అల్లరి చిల్లరగా ఉన్నా తర్వాత బాధ్యత కల యువకుడిగా కనిపిస్తాడని సమాచారం.