`స‌రిలేరు నీకెవ్వ‌రు`ని  మ‌హేష్‌ ఆ హీరో కోస‌మే చేశారా?


Mahesh Sarileru neekevvaru project secret reveald
Mahesh Sarileru neekevvaru project secret reveald

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్‌ల‌ని సాధిస్తోంది. వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించ‌డంతో ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సంక్రాంతి సంద‌ర్భంగా హీరో మ‌హేష్‌, వెంక‌టేష్‌ల‌ని ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేశారు.

ఇందులో మ‌హేష్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` అబ్బ‌బ్బా ఏం మాస్‌. ఏం మ‌హేష్.. ఆ ఎన‌ర్జీ ఏంటీ అనిల్. తాను సినిమా చూశాన‌ని, చాలా అద్భుతంగా వుంద‌ని, ఆల్ ఎమోష‌న్స్ ఉన్నాయి. సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా వుంది. మ‌హేష్ రెచ్చిపోయాడ‌ని, మొద‌టి ఫ్రేమ్ నుంచి చివ‌రి ఫ్రేమ్ వ‌ర‌కు మ‌హేష్ ఒకేలా వున్నాడ‌ని, ఇలా మెయింటైన్ చేయ‌డానికి గ‌ల కార‌ణం ఏంట‌ని వెంక‌టేష్ ఈ సంద‌ర్భంగా మహేష్ ని ప్ర‌శ్నించారు.

త‌న‌లో ఆ జోస్‌కి మీరే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించిన మ‌హేష్ .. వెంకీ టైమింగ్ అంటే విప‌రీత‌మైన ఇష్ట‌మ‌ని, ప్రేమంటే ఇదేరా, నువ్వునాకు న‌చ్చావ్ చిత్రాల్లో మీ కామెడీ మ‌రో స్థాయిలో వుంటుంద‌ని, ఎఫ్ 2 చేస్తున్న స‌మ‌యంలో అనిల్ త‌న‌కు 40 నిమిషాల పాటు క‌థ చెప్పాడ‌ని, అందులో మీ న‌ట‌న చూసి స‌ర్‌ప్రైజ్ అయ్యాన‌ని, అప్పుడే త‌న‌లో స్వార్థం పుట్టింద‌ని `ఎఫ్‌2` స‌క్సెస్ త‌రువాత వెంట‌నే అనిల్‌కి ఫోన్ చేసి `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా మొద‌లుపెడ‌దాం అని చెప్పాన‌ని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.