‘సర్కారు వారి పాట’ పాటల కార్యక్రమం షురూ

mahesh sarkaru vaari paata music sessions soon
mahesh sarkaru vaari paata music sessions soon

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో మొదలుపెడదామని ముందు భావించారు. నిజానికి సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు మూడు నెలలు సినిమా నుండి గ్యాప్ తీసుకుందామనుకున్నాడు. అయితే కరోనా ప్రభావం కారణంగా ఆ గ్యాప్ కాస్తా ఇప్పుడు ఎనిమిది నెలలైంది. సెప్టెంబర్ లో కూడా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు. కరోనా ప్రభావం కొంతైనా తగ్గిన తర్వాతే షూటింగ్ ను మొదలుపెడదామని మహేష్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పినట్లు సమాచారం.

అయితే ఈలోగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేద్దాం అని దర్శకుడు పరశురామ్ తో చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందే. మహేష్ ఇటీవలే పరశురామ్ తో ఫోన్ లో మాట్లాడి ఈ చిత్రానికి గల మ్యూజిక్ సెషన్స్ ను పూర్తి చేసేయమన్నట్లు సమాచారం. షూటింగ్ కు వెళ్లే లోగా ట్యూన్స్ పూర్తైపోయి, సాంగ్స్ రికార్డింగ్ కూడా అయిపోతే, షూటింగ్ కు చాలా వీలవుతుందని, సందర్భానికి తగినట్లుగా సాంగ్ షూటింగ్ చేసుకోవచ్చని, ఫాస్ట్ షెడ్యూల్స్ అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందని మహేష్, దర్శకుడితో చెప్పినట్లు తెలుస్తోంది.

అందుకే త్వరలో సర్కారు వారి పాట మ్యూజిక్ సెషన్స్ ను పూర్తి చేయనున్నాడు దర్శకుడు పరశురామ్.