దుబాయ్‌లో `స‌ర్కారు వారి పాట` పాడేస్తున్నారు!


దుబాయ్‌లో `స‌ర్కారు వారి పాట` పాడేస్తున్నారు!
దుబాయ్‌లో `స‌ర్కారు వారి పాట` పాడేస్తున్నారు!

సూప‌ర్‌స్టార్ మహేష్ గ‌త ఏడాది సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత వెంట‌నే కొత్త చిత్రాన్ని ప్రారంభించాల‌నుకున్నారు కానీ కోవిడ్ కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో మ‌హేష్ దాదాపు 13 నెల‌లు వేయిట్ చేయాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`.

యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఇంత వ‌ర‌కు స్టార్ట్ కాలేదు. తాజాగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని సోమ‌వారం దుబాయ్‌లో మొద‌లుపెట్టేశారు.

ఈ షెడ్యూల్ కోసం ఇటీవ‌లే దుబాయ్ వెళ్లిన మ‌హేష్ అక్క‌డే వైఫ్ న‌మ్ర‌త బర్త్ డేని సెల‌బ్రేట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తిసురేష్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దుబాయ్  షెడ్యూల్ కోసం కీర్తి సురేష్ కూడా దుబాయ్ వెళ్లింది. అక్క‌డే మ‌హేష్‌, కీర్తిసురేష్‌ల‌పై ప‌లు కీల‌క స‌న్న‌వేశాల్ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.