క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌హేష్ మూవీ షెడ్యూల్ మారింది?


క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌హేష్ మూవీ షెడ్యూల్ మారింది?
క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌హేష్ మూవీ షెడ్యూల్ మారింది?

మ‌న‌వాళ్లు చాలా మంది ఊ అంటూ విదేశాల్లో పాటేసుకోవ‌డం లేదా.. స‌రదాగా ఫైటేసుకోవ‌డం.., క‌థ డిమాండ్ అంటూ కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు విదేశాలు చుట్టేయ‌డం గ‌త కొంత కాలంగా స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. కానీ ఇప్పుడు అలా విదేశాలు వెళ‌దాం అంటే హీరోలే వ‌ద్దని చెప్పే ప‌రిస్థితి వ‌చ్చింది.  కార‌ణం క‌రోనా..

క‌రోనా వ‌చ్చింది. కాలం మారింది.  ఇండియాలో కంటే విదేశాల్లోనే అత్య‌ధిక శాతం విళ‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. వేళ‌ల్లో మ‌ర‌ణాలు విదేశాల్లోనే సంభ‌విస్తున్నాయి. దీంతో స‌ర‌దాకైనా విదేశాల్లో షూటింగ్ అంటే వ‌ద్దు బాబోయ్ అంటున్నార‌ట‌. తాజాగా ఓ స్టార్ హీరో సినిమా యూ ఎస్‌లో కీల‌క షెడ్యూల్ చేయాల్సింది. విష‌యం తెలిసిందే హీరో ఆ షెడ్యూల్‌ని ద‌ర్శ‌కుడిచేత రి వ్రైట్ చేయించి ఇండియాలోనే చేద్దామ‌ని మార్పించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ టైటిల్ పోస్ట‌ర్‌ని సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున మేక‌ర్స్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మేజ‌ర్ పార్ట్ అంతా యుఎస్‌లోనే ప్లాన్ చేశార‌ట‌. క‌రోనా వైర‌స్ భీభ‌త్సం సృష్టిస్తున్న నేప‌థ్యంలో మ‌హేష్ మాత్రం యుఎస్ షెడ్యూల్‌ని ఇండియాలోనే చేద్దామ‌ని పూర్తిగా మార్చేశార‌ట‌. బ్యాంకుల్ని మోసం చేసి వంద‌ల కోట్లు రుణాలు తీసుకుని విదేశాల‌కు పారిపోయిన ఓ మోస‌గాడి చుట్టూ అల్లుకున్న క‌థ‌గా ఈ సినిమా వుండే అవ‌కాశం వుందిని తెలిసింది.