పూరి జగన్నాధ్ ని అవమానించిన మహేష్


పూరి జగన్నాధ్ ని అవమానించిన మహేష్
Mahesh Babu

తనకు పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చి సూపర్ స్టార్ ని చేసిన దర్శకులు పూరి జగన్నాధ్ ని అవమానించాడు మహేష్ బాబు . మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మహేష్ బాబు తనని ఇంతవాన్ని చేసిన దర్శకుల గురించి చెప్పుకుంటూ పోయాడు అయితే ఆ లిస్టు లో పూరి జగన్నాధ్ పేరు లేకపోవడం తో అందరూ ఖంగుతిన్నారు . వేదిక మీద ఎవరు కూడా గుర్తు చేయలేదు పాపం దాంతో మహేష్ బాబు తన తప్పుని ఆలస్యంగా తెలుసుకున్నాడు . పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన పూరి జగన్నాధ్ పేరు మర్చిపోయానని ట్వీట్ చేసి సారీ చెప్పాడు మహేష్ .

మహేష్ బాబు ని సూపర్ స్టార్ చేసిన చిత్రం పోకిరి , అయితే మాటల మద్యలో మహేష్ ఎక్కడో మర్చిపోయాడు పాపం ! దాంతో వేరే వాళ్ళకు మరోలా అర్ధం అవుతుంది కాబట్టి మరింతగా అపార్దం చేసుకోక ముందే తేరుకున్న మహేష్ పూరి కి సారీ చెప్పి ట్వీట్ చేసాడు . పూరి జగన్నాధ్ – మహేష్ బాబు ల కాంబినేషన్ లో పోకిరి , బిజినెస్ మెన్ చిత్రాలు వచ్చాయి , పోకిరి ఇండస్ట్రీ హిట్ కాగా బిజినెస్ మెన్ జస్ట్ హిట్ .