పూజా హెగ్డే పై సెటైర్ వేసిన మహేష్ బాబు


పూజా హెగ్డే పై సెటైర్ వేసిన మహేష్ బాబు
పూజా హెగ్డే పై సెటైర్ వేసిన మహేష్ బాబు
మహేష్ బాబు కనిపించడు కానీ సెటైర్ లు వేయడంలో చాలా దిట్ట . ఈ విషయం మహేష్ తో పనిచేసిన వాళ్ళకు , దగ్గరగా చూసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది . చాలా సింపుల్ గా మాట్లాడినట్లే ఉంటుంది కానీ తెలియకుండానే చురకలు అంటిస్తాడు మహేష్ . తాజాగా మహర్షి వేడుకలో కూడా సుకుమార్ పై సెటైర్ వేసాడు అలాగే హీరోయిన్ పూజా హెగ్డే పై కూడా సెటైర్ వేసి అందరినీ నవ్వించాడు .
ఇంతకీ పూజా హెగ్డే ఏమందో తెలుసా ……. మహేష్ బాబు మంచి నటుడే కాదు మంచి దర్శకుడు కూడా ఎందుకంటే నేను నటిస్తున్నపుడు నాకు అర్ధమైన విషయం అని పూజా హెగ్డే మాట్లాడుతు అంది . దానికి మహేష్ కౌంటర్ ఇస్తూ నేను నటుడ్ని మాత్రమే ! ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి నటుడి పని నటుడు , దర్శకుడి పని దర్శకుడిది అంటూ పూజా హెగ్డే  కు కౌంటర్ ఇచ్చాడు .