సుకుమార్ పై సెటైర్ వేసిన మహేష్ బాబు


సుకుమార్ పై సెటైర్ వేసిన మహేష్ బాబు
సుకుమార్ మరియు మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకులు సుకుమార్ పై సెటైర్ వేసాడు . నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన అభిమానులనుద్దేశించి మాట్లాడిన మహేష్ సుకుమార్ పేరు ఎత్తలేదు కానీ పరోక్షంగా సుకుమార్ పై విమర్శలు చేసాడు . కథ చెప్పి రెండు నెలలు కూడా వెయిట్ చేసే దర్శకులు లేని ఈరోజుల్లో నాకోసం వంశీ పైడిపల్లి రెండేళ్ళు ఎదురు చూసాడని వంశీ కాకుండా మరో దర్శకుడైతే ఎదురు చూడకుండా మరో హీరో కోసం వెళ్తారని విసుర్లు విసిరాడు .

అయితే సుకుమార్ పేరు చెప్పలేదు కానీ మహేష్ వేసిన సెటైర్ సుకుమార్ పైనే . ఎందుకంటే మహేష్ బాబు తో మరో సినిమా చేయాలనీ కథ కూడా చెప్పాడు సుకుమార్ కానీ మహర్షి పూర్తికాలేదు కాబట్టి సుకుమార్ ని వెయిటింగ్ లిస్టు లో పెట్టాడు మహేష్ దాంతో అదే కథ ని తీసుకొని అల్లు అర్జున్ ని కలిసి ఒప్పించాడు సుకుమార్ . కట్ చేస్తే అక్కడా వెయిటింగ్ తప్పడం లేదు సుకుమార్ . అందుకే మహేష్ సుకుమార్ పై సెటైర్ వేసినట్లు తెలుస్తోంది .